![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2'). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -713 లో...... జ్యోత్స్న, సూరజ్ స్కూటీపై ఆఫీస్ కి వస్తారు. సూరజ్ కి అప్పోజిట్ గా జ్యోత్స్న కూర్చొని ఉంటుంది. దారిలో వెళ్ళేవాళ్లందరు వాళ్ళిద్దరిని చూసి ఏంటి కొత్తగా పెళ్లి గా అయిందా ఇద్దరికి పడట్లేదా మంచి లాయర్ ఉన్నాడు.. నెంబర్ ఇవ్వమంటారా అని అంటుంటే జ్యోత్స్న అతనిపై కోప్పడుతుంది. మరి సరిగ్గా కూర్చోవచ్చు కదా అని సూరజ్ అంటాడు. ఆ తర్వాత కాసేపటికి దాహంగా ఉంది స్కూటీ ఆపమని జ్యోత్స్న చెప్తుంది.
దాంతో సూరజ్ స్కూటీ ఆపి వాటర్ తీసుకొని రావడానికి వెళ్తాడు. వచ్చేలోపు జ్యోత్స్న టైర్ పంచర్ చేస్తుంది. సూరజ్ వచ్చి తనకి వాటర్ ఇచ్చి ఇరవై రూపాయలు అయింది.. అన్ని రాసుకుంటాను.. శాలరీ వచ్చాక ఇవ్వాలని సూరజ్ అంటాడు. స్కూటీ చూసేసరికి పంచర్ అయి ఉంటుంది. దాంతో త్వరగా వెళ్లు టైమ్ కి వెళ్ళాలని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్న కూర్చొని ఉంటే సూరజ్ స్కూటీ తోసుకుంటు వస్తాడు. మరొకవైపు ఇంకా సూరజ్, జ్యోత్స్న రాలేదని దీప అంటుంది. అది బ్రదర్ ని ఎన్ని ఇబ్బందులు పెడుతుందో ఏమో అని కార్తీక్ అంటాడు. మరొకవైపు స్కూటీ తోసుకుంటూ ఆఫీస్ వరకు వస్తాడు సూరజ్. వచ్చాక నీ కష్టం ఉంచుకోనని అయిదు వందల నోటు తీసి ఇస్తుంది జ్యోత్స్న. ఏంటి షాక్ అయ్యావా.. డబ్బులు లేవు.. అంది ఎలా ఇచ్చాను అనుకుంటున్నావా అన్ని అర్థమవుతాయి కదా అని జ్యోత్స్న వెళ్తుంటే తన బ్యాగ్ నుంచి లిప్ స్టిక్ కిందపడుతుంది. అది చూసి సూరజ్ తీసుకొని నీకు ఎలా బుద్ది చెప్పాలో నాకు తెలుసనుకుంటాడు. జ్యోత్స్న లోపలికి వెళ్లి దీపతో మాట్లాడుతుంది. సూరజ్ కూడా వచ్చి మాట్లాడి వెళ్తుంటే సూరజ్ షర్ట్ పైన లిప్స్ స్టాంప్ చూసి ఏంటి బ్రదర్ మ్యాటర్ అంత దూరం పోయిందా అని కార్తీక్ అంటాడు.
ఏంటి జ్యోత్స్న అది అని కార్తీక్ ఆటపట్టిస్తుంటే అది ఎలా వచ్చిందని జ్యోత్స్న షాక్ అవుతుంది. సూరజ్ సిగ్గుపడుతాడు. దాంతో జ్యోత్స్నని ఇంకా కార్తీక్ ఆటపట్టిస్తాడు. సూరజ్ దగ్గరికి జ్యోత్స్న వెళ్లి రివెంజ్ కదా అని అంటుంది. భలే కనిపెట్టావని లిప్ స్టిక్ ఇంకా అయిదువందలు ఇస్తాడు. ఆ తర్వాత దక్షిణామూర్తి వచ్చి జ్యోత్స్న ఎందుకు బయట కూర్చొని ఉందని అంటాడు. దీప అసిస్టెంట్ జ్యోత్స్న అనగానే నా మనవరాలిని అసిస్టెంట్ చేసింది ఎవరని దక్షిణామూర్తి అంటుంటే శివన్నారాయణ వస్తాడు. దక్షిణామూర్తిని క్యాబిన్ కి తీసుకొని వెళ్లి మాట్లాడతాడు. ఎందుకు వచ్చావని శివన్నారాయణ అడుగుతాడు. నీ ప్రతీ రెస్టారెంట్ ముందు నాదొక బ్రాంచ్ ఏర్పాట్లు చేస్తున్నానని దక్షిణామూర్తి చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో వాడు ఎందుకు అలా అన్నాడు. నా ఆఫీస్ లో వాడి మనిషి ఎవరైనా ఉన్నారా అని శివన్నారాయణ అనుకుంటాడు. అప్పుడే దక్షిణామూర్తి వెళ్తు బయట సూరజ్ తో మాట్లాడడం శివన్నారాయణ చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |